ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పేరును చేర్చిన ఈడీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 May 2024 10:45 PM IST
ED Has Filed Another Chargesheet In The Delhi Liquor Case
X

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పేరును కూడా ఛార్జిషీట్‌లో చేర్చింది ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్. ఆప్‌, కేజ్రీవాల్‌ను నిందితులుగా పేర్కొంటూ 8వ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో..సీఎం కేజ్రీవాల్‌ను కీలక సూత్రధారిగా ఆరోపిస్తూ.. ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు రెండు నెలల పాటు తీహాడ్‌లో జైలులోనే ఉన్నారు కేజ్రీవాల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇటీవల రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్. ఇదే కేసులో.. తాజాగా ఈడీ మరోసారి ఛార్జిషీట్‌ దాఖలు చేయడం ఆసక్తిగా మారింది. కేజ్రీవాల్‌తో పాటు.. ఆప్‌ను కూడా కుట్రలో భాగంగా పేర్కొనడం గమనార్హం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story