చైనా యాప్ ల కేసులో ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్.. రూ.1000 కోట్లు..

ED Arrests Chartered Accountant
x

చైనా యాప్ ల కేసులో ఛార్టెట్ అకౌంటెంట్ అరెస్ట్.. రూ.1000 కోట్లు..

Highlights

Enforcement Directorate: చైనా యాప్స్‌ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది.

Enforcement Directorate: చైనా యాప్స్‌ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీకి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఫోర్జరీ ఎయిర్‌వే బిల్లులతో దాదాపు వెయ్యి కోట్లు అక్రమంగా చైనాకు తరలించినట్లు అధికారులు తెలిపారు. బోగస్ బిల్లుల జారీలో ఛార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది. రవికుమార్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా రేపటి నుంచి ఈ నెల 9వరకూ ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నకిలీ బిల్లులకు సంబంధించి డొల్ల కంపెనీ నిర్వహకులు పరారీలో ఉన్నారని, గేమింగ్, డేటింగ్ యాప్‌ల పేరుతో వేల కోట్లు దేశం దాటించినట్లు ఈడీ స్పష్టం చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories