లడఖ్ లో 5.4 తీవ్రతతో భూప్రకంపనలు

లడఖ్ లో 5.4 తీవ్రతతో భూప్రకంపనలు
x
Highlights

శుక్రవారం మధ్యాహ్నం లేహ్-లడఖ్ ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) ప్రకారం, లడఖ్‌లోని లేహ్ కు ఈశాన్యంగా...

శుక్రవారం మధ్యాహ్నం లేహ్-లడఖ్ ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) ప్రకారం, లడఖ్‌లోని లేహ్ కు ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో, 129 కిలోమీటర్ల లోతులో సాయంత్రం 4.27 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ఈ భూ ప్రకంపన 34.96 N అక్షాంశం మరియు 78.59 E యొక్క రేఖాంశంగా నమోదయింది. దీంతో లడఖ్ లోని పల్లె ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్లలో అటక మీద ఉన్న వస్తువులు కిందపడటంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

అయితే ప్రకంపనల కారణంగా పెద్దగా నష్టమేమి జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రకంపనల ధాటికి కొన్ని పురాతన భవనాలలో పగుళ్లు ఏర్పడినట్టు సమాచారం. ఇదిలావుంటే బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 3.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి.అయితే ఆ సమయంలో కూడా పెద్ద నష్టమేమి జరగలేదని అధికారులు నివేదించారు. ఇక తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే లడక్ లో ప్రకంపనలు రావడంపై అధికారులు ఆరాతీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories