రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా.. ట్రక్కుతో డీఎస్పీని తొక్కి చంపిన మాఫియా..

Mining Mafia: హర్యానాలో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోయింది.

Arun Chilukuri
Updated on: 19 July 2022 5:54 PM IST
DSP Surendra Singh Killed by Mining Mafia During Raid in Haryana
X

రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా.. ట్రక్కుతో డీఎస్పీని తొక్కి చంపిన మాఫియా..

Mining Mafia: హర్యానాలో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోయింది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఓ డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి చంపేసింది. ఈ సంఘటన ఆ రాష్ట్రంలోని నూహ్‌ ప్రాంతంలో జరిగింది. గనుల్లో అక్రమంగా రాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న డీఎస్పీ సురేంద్ర సింఘ్ బిష్ణోయ్‌ సంఘటనా స్థలానికి వెళ్లారు. అయితే సురేంద్ర రావడంతో రాళ్లను తరలిస్తున్న ట్రక్‌ ఆగిపోయింది.

ఆ తరువాత ట్రక్‌ డ్రైవర్‌ సురేంద్రపైకి దూసుకెళ్లాడు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌తో సహా మైనింగ్‌ మాఫియాకు చెందిన వారు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ సురేంద్ర సింఘ్‌ బిష్ణోయ్‌ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు నుహ్‌ ఐజీ తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story