Drugs Seized: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 53 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Drugs Worth 53 Crores Seized in Shamshabad Airport
x

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన డ్రగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Drugs Seized: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.53కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..ఓ మహిళ అరెస్ట్

Drugs Seized: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఓ మహిళపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా.. 8 కిలోల‌ హెరాయిన్‌ లభ్యమైనట్లు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకోని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం ఉదయం దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ కు వ‌చ్చిన మ‌హిళ వ‌ద్ద మాద‌క‌ద్ర‌వ్యాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో డీఆర్ఐ అధికారులు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా క‌రోల్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు చెన్నై విమానాశ్రంలో కూడా 10కేజీల హెరాయిన్ లభ్యమైనట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీని విలువ రూ.73 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మహిళ కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు తెలిపారు. శంషాబాద్, ఇటు చెన్నై ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ మహిళలు నుంచి కస్టమ్స్ అధికారులు పూర్తి వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories