Karnataka drugs case updates : బెంగళూరులో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

కర్ణాటక డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది.. ప్రముఖ నటుడు దిగత్ ను మరోసారి విచారించిన పోలీసులు.. అతను ముంబాయి..

Raj
By Raj
Updated on: 24 Sept 2020 12:23 PM IST
Karnataka drugs case updates : బెంగళూరులో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
X

కర్ణాటక డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది.. ప్రముఖ నటుడు దిగత్ ను మరోసారి విచారించిన పోలీసులు.. అతను ముంబాయి, గోవా, శ్రీలంక, బెంగళూరు తదితర ప్రాంతాల్లో విందులకు హాజరైనట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ లో ఉన్నవారు దిగత్ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ నెల 16న ఆయన భార్య, నటి ఐంద్రిత రాయ్ తో కలిసి విచారణకు హాజరయ్యారు.. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని దిగత్ కు పోలీసులు స్పష్టం చేశారు. అలాగే మరో నలుగురు బుల్లితెర నటులను కూడా ఐఎస్డి అధికారులు విచారించారు.

మరోవైపు ఓ మాజీ ఎంపీ కుమారుడు, ప్రస్తుత ఎంపీ కుటుంబ సభ్యులను విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అరెస్టయిన 17 మంది నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లలో సమాచారం సీసీబీకి చిక్కింది. ఇక ఇప్పటికే అరెస్టైన రాగిణి.. సన్నిహితుడు రవిశంకర్ మొదటి భార్య అర్చన నాయక్ కు సిసిబి నోటీసులు ఇచ్చింది. ఇదిలావుంటే బెంగళూరులో డ్రగ్స్ ను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ 3.30 కోట్ల విలువైన 125 గ్రాముల ఆఫీమ్,150 గ్రాముల బ్రౌన్ షుగర్, 35 ఎల్ఎస్డి స్లిప్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిశోయ్, బి షో, సునీల్ కుమార్ నుంచి మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Raj

Raj

Next Story