ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం విషాదభరితం.. ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం..

ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం విషాదభరితం.. ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం..
Draupadi Murmu: ఒడిశాలోని ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము.
Draupadi Murmu: ఒడిశాలోని ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఆమెకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళకు ఆదివాసీలకు అత్యున్నత స్థానం ఇవ్వడంతో పాటు ఓ మహిళకు దేశ అత్యున్నత పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె మయూర్‌భంజ్‌లోని రాయంగ్‌పూర్ నుంచి 2000, 2009లో బిజెపి టిక్కెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.
అంతకుముందు 1997లో రాయంగ్‌పూర్ నగర్ పంచాయతీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. BJP తరపున షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తర్వాత, 2000లో రాయంగ్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్యకాలంలో వాణిజ్యం, రవాణా శాఖ, ఆ తరువాత ఫిషరీస్, జంతు వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్లు పూర్తికాలం గవర్నర్ పదవిలో కొనసాగారు.
దేశ అత్యున్నత స్థానం కోసం పోటీ పడుతున్న ద్రౌపది ముర్ము తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, విషాదాలను ఎదుర్కొన్నారు. 2009లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక కుమారుడు మరణించాడు. ఈ విషాదం నుంచి తెరుకునే లోపే, 2012లో రోడ్డు ప్రమాదంలో మరో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. భర్త శ్యామ్ చరణ్ ముర్ము గుండెపోటుతో మరణించారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
విషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTమంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..
25 Jun 2022 9:16 AM GMTజేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థులు సస్పెండ్..
25 Jun 2022 9:02 AM GMT