logo
జాతీయం

2DG Drug: ఈ రోజు నుంచి మార్కెట్లోకి డీఆర్‌డీవో మందు

2DG Drug Will Be Available In Markets From Today
X

2DG Drug: ఈ రోజు నుంచి మార్కెట్లోకి డీఆర్‌డీవో మందు

Highlights

2DG Drug: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌. 2డీజీ మెడిసిన్‌ అందుబాటులోకి వచ్చేసింది.

2DG Drug: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌. 2డీజీ మెడిసిన్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఈరోజు నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉండనుందని డీఆర్డీవో వెల్లడించింది. రెమిడెసివర్‌ను వాడొద్దని డబ్ల్యూహెచ్‌వో బ్యాన్‌ చేసింది. ఇక కరోనాను కంట్రోల్‌ చేసే మందే లేదా అన్న టైంలో 2డీజీ అనౌన్స్‌మెంట్‌ కరోనా బాధితులకు ఊరట కలిగించింది. కానీ 2డీజీ మందు ఎప్పుడు వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూశారు. మొత్తానికి వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఇవ్వాల్టీ నుంచి 2డీజీ మెడిసిన్‌ను మార్కెట్‌లో కోనేయచ్చు.

కరోనా చికిత్సలో 2డీజీ డ్రగ్‌ మెరుగైన ఫలితాలు ఇస్తుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి వెల్లడించారు. వారంలోగా హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ద్వారా 6 నుంచి 8 లక్షల 2డీజీ ప్యాకెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని సంస్థల ద్వారా ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచే ముడి పదార్థాన్ని మరికొన్ని సంస్థలకు ఇచ్చి ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని అన్నారు.

సైనికులపై రేడియేషన్‌ ప్రభావం పడకుండా ఉండేందుకు పదేళ్లుగా ప్రయోగాలు చేసి 2డీజీ మందును తీసుకొచ్చినట్లు సతీష్‌ రెడ్డి తెలిపారు. అదృష్టవశాత్తు కరోనా చికిత్సలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో 2డీజీ మంచి ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు.

Web TitleDRDO's 2DG Drug Will Be Available In Markets From Today
Next Story