చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము .. రాష్ట్రపతిగా తొలి ఆదివాసి మహిళ..

President Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు.

Arun Chilukuri
Published on: 21 July 2022 8:12 PM IST
Draupadi Murmu Historic Win in Presidential Elections
X

చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము .. రాష్ట్రపతిగా తొలి ఆదివాసి మహిళ

President Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై విజయం సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story