ఆపరేషన్ కరోనా కోసం ట్రంప్, జిన్ పింగ్ రాజీ వ్యూహం?

ఆపరేషన్ కరోనా కోసం ట్రంప్, జిన్ పింగ్ రాజీ వ్యూహం?
x
donald trump, xi jinping
Highlights

విబేధాలు పక్కనబెట్టి కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జింపింగ్ లు ఫోన్ లో చర్చించారు.

విబేధాలు పక్కనబెట్టి కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జింపింగ్ లు ఫోన్ లో చర్చించారు. మొన్నటిదాకా రెండు దేశాలు వైరస్ మీ వల్ల వచ్చిందంటే మీ వల్ల వచ్చిందని ఎద్దేవా చేసుకున్నారు.. వాస్తవానికి వైరస్ చైనా నుంచి వచ్చిందన్న విషయం ప్రపంచం మొత్తం తెలుసు.. అయినా అమెరికాను కూడా నిందిస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాలు కరోనా సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు నడుం బిగించాయి. అందులో భాగంగా అధ్యక్షులు ఇద్దరు నిన్న రాత్రి 9 గంటలకు ఫోనులో మాట్లాడుకున్నారు. ఈ సందర్బంగా కరోనాని అరికట్టేందుకు రెండు దేశాలు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయానికి వచ్చారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ఈమేరకు ఆయన ఫోన్ ద్వారా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరిపారు..

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధించి తమ అనుభవాలను, అలాగే రాబోయే ఉపద్రవం గురించిఅగ్రరాజ్యంతో పంచుకుంటామని స్పష్టం చేశారు. చైనాకన్నా అధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదు కావడంతో ఫోనులో జిన్పింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. "ప్రస్తుతం అమెరికా-చైనా సంబంధాలు సంక్లిష్ట దశలో ఉన్నాయి. ఈ సమయంలో పరస్పర సహకారం ఇద్దరికీ అవసరం. ప్రస్తుతానికి ఇదే ఇద్దరికి ఉన్న ఉత్తమ మార్గం. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అమెరికా సరైన చర్యలు తీసుకుంటుందని, కరోనాపై పోరాడేందుకు ఇరు దేశాలు సమన్వయంతో కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నా" అంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే చైనాలోని వుహాన్ నుంచి కరోనా వైరస్ అమెరికాకు అంటించారని ట్రంప్ సహా అమెరికా ప్రజలు కూడా ఆరోపిస్తుంటే.. అమెరికా సైన్యమే వుహాన్కు వైరస్ను తీసుకొచ్చిందని చైనా ప్రత్యారోపణ చేస్తోంది.. ఈ క్రమంలో ఇరువురు అధ్యక్షులు ఫోనులు సానుకూలంగా మాట్లాడుకోవడం పట్ల రాజి ధోరణి ఉందన్న విషయం అర్ధమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories