PAN Aadhaar Link: పాన్, ఆధార్ లింక్ చేయడానికి లాస్ట్ డేట్ తెలుసా

PAN Aadhaar Link:ఈ నెలాఖరు లోపల పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Kranthi
Published on: 19 March 2021 2:53 PM IST
PAN and Aadhaar Linking Last Date
X

PAN Aadhaar Link:( ఫోటో: ది హన్స్ ఇండియా)

PAN Aadhaar Link: మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండూ ఉన్నాయా.. ఉంటే మీరు చేయవలసిన పని వాటిని లింక్ చేయడం. ఈ రెండిటిని లింక్ చేసే తేదీ ముగింపు గడువు దగ్గరపడుతోంది. మీకు తెలుసా. అవునండి మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు మార్చి 31వ తేదీ గడువు ముగియనుంది. ఇక తాజాగా పాన్‌ కార్డును మీ ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు చివరి తేదీ మార్చి 31. అయితే ఇప్పటికీ మారు అనుసంధానం చేయకపోతే ఈనెలాఖరులో గా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు లింక్ చేసుకోకపోతే దాదాపు రూ. 10,000 వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. ఆధార్‌ లేని పాన్‌ కార్డులను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏ (2) ప్రకారం రద్దు చేస్తామని సీబీడీటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తామని సైతం కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Kranthi

Kranthi

Next Story