Indian Railway: రైలులో 5 సంవత్సరాల పిల్లలకి టికెట్ అవసరమా..?

Do Children Below 5 Years of age Need Tickets in Train Know the Truth
x

Indian Railway: రైలులో 5 సంవత్సరాల పిల్లలకి టికెట్ అవసరమా..?

Highlights

Indian Railway: భారతీయ రైల్వేలు దేశానికి జీవనాధారం. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ ఇళ్లకు చేరుకోవడానికి రైలులో ప్రయాణిస్తున్నారు.

Indian Railway: భారతీయ రైల్వేలు దేశానికి జీవనాధారం. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ ఇళ్లకు చేరుకోవడానికి రైలులో ప్రయాణిస్తున్నారు. ఇందులో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలకి సంబంధించి రైల్వేలు కొన్ని ముఖ్యమైన నిబంధనలను రూపొందించాయి. ప్రస్తుతం ఐదేళ్ల లోపు చిన్నారులు రైలులో ప్రయాణించాలంటే టిక్కెట్లు కొనాల్సిందేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది వేగంగా వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు రైల్వే టిక్కెట్లు కొనాల్సిందేనని కొన్ని మీడియాలలో ప్రచారం జరిగింది. ఈ పరిస్థితిలో PIB ఈ విషయంపై వాస్తవ తనిఖీ చేసింది. ఈ వాదన పూర్తిగా తప్పు అని తేల్చింది. భారతీయ రైల్వేలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్లు కొనడాన్ని తప్పనిసరి చేయలేదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి కావాలనుకుంటే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తన బిడ్డకు రైల్వే టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. లేదంటే కొనకపోవచ్చు. ఇది అతడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్లు కొనాలని రైల్వే నిబంధన పెట్టలేదు. అంతేకాదు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రైల్వే రిజర్వేషన్ కూడా అవసరం లేదు. పిల్లలు టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు.

రైలులో పెద్ద సంఖ్యలో పిల్లలు ప్రయాణిస్తున్న దృష్ట్యా రైల్వే పిల్లలకు అనేక సౌకర్యాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బేబీ బెర్త్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. ఉత్తర రైల్వే జోన్‌లోని ఢిల్లీ డివిజన్‌లో మహిళలు, చిన్న పిల్లల సౌకర్యార్థం రైల్వే బేబీ బర్త్‌ను ప్రారంభించింది. దీని కింద రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు సులభంగా పడుకోవడానికి వీలుగా దిగువ బెర్త్‌లో చిన్న సీటు పొందుతారు. దీంతో పాటు రైలులో పిల్లలకు సౌకర్యవంతమైన సీటు సౌకర్యం లభిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories