Tamil Nadu: తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు.

Arun Chilukuri
Published on: 7 May 2021 9:33 AM IST
DMK Chief MK Stalin Takes Oath as Tamil Nadu CM
X

Tamil Nadu: తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story