కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై స్పందించిన దిగ్విజయ్‌ సింగ్‌

Digvijaya Singh: త్వరలోనే నామినేషన్‌పై క్లారిటీ ఇస్తా

Rama Rao
Published on: 23 Sept 2022 1:06 PM IST
Digvijaya Singh Reacts on the Congress presidential election
X

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై స్పందించిన దిగ్విజయ్‌ సింగ్‌ 

Digvijaya Singh: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. పొడిగా సమాధానాలు చెప్పిన దిగ్విజయ్‌ తాను నామినేషన్‌ వేసేది లేనిది ఈనెల 30వ తేదీ వరకు వేచి చూడాలన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన పార్టీలో అందరికీ వర్తిస్తుందన్నారు. భారత్‌ జోడో యాత్రపై బిజేపీ విమర్శలను ఖండిచారు. పరివార్‌ అంటే కాంగ్రెస్‌ దృష్టిలో విశ్వం మొత్తం అని అదే బిజేపీ సంఘ్‌ మాత్రమే పరివార్‌ అన్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయని.. నాన్‌ గాంధీలను ఎన్నికల్లో పాల్గొనకుండా ఎవరైనా ఆపగలరా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట కూడా పార్టీలో గాంధీ కుటుంబ సభ్యుల సేవలు కొనసాగుతాయన్నారు.

Rama Rao

Rama Rao

Next Story