నితీశ్‌పై కమలం పగ తీర్చుకుందా.. ఆపరేషన్ మణిపూర్ సీక్రెట్స్ ఏంటి?

Did BJP Take Revenge on Nitish Kumar ?
x

నితీశ్‌పై కమలం పగ తీర్చుకుందా.. ఆపరేషన్ మణిపూర్ సీక్రెట్స్ ఏంటి?

Highlights

Nitish Kumar: ఆపరేషన్ మణిపూర్.. నితీశ్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్‌లో ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇదే.

Nitish Kumar: ఆపరేషన్ మణిపూర్.. నితీశ్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్‌లో ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇదే. జేడీయూ చీఫ్ బీజేపీకి బిహార్‌లో ఝలక్ ఇస్తే.. కమలనాథులు మణిపూర్‌లో చెక్ పెట్టేశారు. మణిపూర్‌లో జేడీయూ ఎమ్మెల్యేలకు వెల్‌కమ్ చెప్పి ప్రధాని రేసులో కాదు కదా.. నితీశ్‌ను కనీసం బిహార్ బోర్డర్ కూడా దాటనిచ్చేది లేదని హింట్స్ ఇచ్చేశారు. ఇంతకూ, బిహార్ సీఎంపై కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటి..? ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసలేం జరుగుతోంది..?

ఎన్డీఏకు హ్యాండ్ ఇచ్చీ ఇవ్వడంతోనే బీజేపీపై పోరు బిహార్ నుంచే అన్నారు.. మోడీ, షా కాదు అంతకుమించిన వ్యూహాలు ఎప్పుడో సిద్ధం అన్నారు.. ఇక మిగిలిందల్లా యాక్షన్‌లోకి దిగిపోవడమే, మీరో మేమో తేల్చేసుకుందాం రెడీనా సవాళ్లు విసిరారు. అంతేనా, బీజేపీయేతర లీడర్లకు చర్చింద్దాం రండని వెల్‌కమ్ చెప్పడం నుంచి యాక్షన్ షురూ చేసేశారు కూడా. కట్‌ చేస్తే కమలనాథుల దెబ్బ ఇలాక్కూడా ఉంటుందా అనేలా ఊహించని, ఊహకందని ఝలక్ తగిలింది. కంట్రీ పాలిటిక్స్‌ గురించి మర్చిపోండి కనీసం బిహార్‌ బోర్డర్ కూడా దాటనివ్వం అంటూ ఆపరేషన్ మణిపూర్‌కు తెరలేచింది. అక్కడి జేడీయూ ఎమ్మెల్యేలపై మొదటి అస్త్రం సంధించేసి, కనీసం వాళ్లతో ఫోన్‌కాల్‌లో మాట్లాడే సీన్ కూడా నితీశ్‌ కుమార్‌కు ఇవ్వకుండా ఆరుగురిలో ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి వెల్‌కమ్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే నితీశ్‌ కుమార్‌పై కమలనాథులు అమలు చేసిన శాంపిల్ స్ట్రాటజీ ఇదే. అయితే, ఈ ఆపరేషన్‌ మాత్రం ఇక్కడితో అయిపోనట్టు కాదు అసలైన యాక్షన్ ముందే ఉందని హింట్స్ కూడా ఇచ్చేశారు.

ఇటీవల బిహార్‌ రాజకీయంలో ఏ రేంజ్‌ ట్విస్టులతో మలుపులు తిరిగిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సింగిల్ డేలోనే ఎన్డీఏ కూటమికి హ్యాండిచ్చిన నితీశ్‌ ఆ వెంటనే మహా కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎన్డీఏ అధిష్టానానికి కానీ, ప్రధాని మోడీకి కానీ కనీసం తమతో చర్చించడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అంతేనా, ఆ తర్వాత బీజేపీ కుట్రలు ఇవే అంటూ మమ్మల్ని, మా పార్టీని చీల్చేద్దాం అనుకున్నారని కాస్త ఘాటైన ఆరోపణలే చేశారు. అయితే, బిహార్‌లో బీజేపీ జేడీయూను చీల్చాలని అనుకుందో లేదో క్లారిటీ లేదు, రాదు. కానీ, ఆ పని మరో రాష్ట్రంలో జరిగింది. అదే ఈశాన్య రాష్ట్రం మణిపూర్. ఇక్కడ నితీశ్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కట్ చేస్తే ఒకేసారి ఐదురుగు ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయిపోయారు. మిగిలిన ఆ ఒక్కరూ కూడా నేడో రేపో అన్నట్టే ఉన్నారు. ఇది నితీశ్‌ కుమార్‌కు బీజేపీ ఇచ్చిన ఝలక్ కాకుండే మరేంటి..?

మరోవైపు ఈ పరిణామాన్ని బీజేపీ తనదైన శైలిలో అభివర్ణిస్తోంది. మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదురుగు పార్టీ మారుతుండం అంటే ఫిరాయింపుల కిందికి రాదంటోంది. అందుకే అఫిషియల్‌గా ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సిద్ధమైనట్టు చెబుతోంది. తాజాగా జేడీయూకి హ్యాండ్ ఇచ్చిన ఐదురుగు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీని బీజేపీలో కలిపేస్తున్నామని స్పీకర్‌కు తెలిపారు. దాన్ని స్పీకర్ ఆమోదించినట్టు మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి మేఘజిత్ సింగ్ నుంచి ప్రకటన సైతం వచ్చేసింది. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో జేడీయూపై యాక్షన్ ఇదే ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2020లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలో చేరారు. గతవారం మిగిలిన ఆ సింగిల్ ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూ ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోయిందన్నమాట. ఈసారి మణిపూర్‌లోని ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక్కడ కూడా మిగిలిన ఆ ఒక్క ఎమ్మెల్యే ఎంతకాలం నిలుస్తారో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

ఇక పనిలో పనిగా బీజేపీ నుంచి సెటైర్లు కూడా రానేవచ్చాయి. బీజేపీ నేుంచి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అమిత్ మాల్వియా సీఎంగానే ఫెయిలయిన వ్యక్తి ఏకంగా పక్రధాని పదవి కోసం చూడడం ఏంటో అని ఓ ఘాటైన ట్వీట్ చేశారు. అంతేనా, ఈశాన్య రాష్ట్రాలే కాదు బిహార్‌లోనూ నితీశ్‌ సర్కార్ రేపో మాపో కూలిపోక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకాస్త ముందుకెళ్లి వెస్ట్‌ బెంగాల్ సీఎం మమతను ఎగ్జాంపుల్ చేస్తూ సెటైర్లు వేశారు. బెంగాల్ బయట ప్రజల నమ్మకాన్ని పొందాలనుకున్న మమత బెనర్జీ చల్లబడ్డారని, ఇప్పుడు నితీశ్‌ కుమార్ కూడా అదే చేస్తున్నారని సెటైర్లు వేశారు. మరో బీజేపీ నేత సుశీల్ మోడీ కూడా నితీశ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు జేడీయూ ముక్త్‌గా మారుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు లాలూజీ త్వరలోనే బిహార్‌ను జేడీయూ రహితంగా మార్చనున్నారని ట్వీట్ చేశారు.

మరోవైపు జేడీయూ నుంచి ఘాటైన రియాక్షన్లే వచ్చాయి. సుశీల్ మోడీ ట్వీట్‌పై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ రివర్స్ పంచ్‌లు పేల్చారు. పగటి కలలు కనొద్దంటూనే 2024 ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని ఎదురు దాడికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్‌లో సంకీర్ణ ధర్మానికి బీజేపీ కట్టుబడి లేదని ఆరోపించారు. అక్కడ మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో విలీనమమయ్యారని, 2015లో మణిపూర్‌లో 53 సీట్లు గెలుచుకోవడానికి ప్రధాని మోడీ 42 ర్యాలీలు నిర్వహించాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.

ఇటీవల బిహార్‌ ఎన్డీఏ కూటమికి హ్యాండ్ ఇచ్చి మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడ్డాకే నితీశ్‌ 2024లో ప్రధాని పదవికి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, నితీశ్ కుమార్ చాలా సందర్భాల్లో వాటిని కొట్టి పరేస్తున్నప్పటికీ ఆ చర్చ మాత్రం జోరుగానే సాగుతుంది. ఇలాంటి పరిణామాల మధ్యే బీజేపీ నేతలు నితీశ్‌ కుమార్‌ను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎప్పటికైనా నితీశ్‌ కుమార్ బరిలోకి దిగుతారని కమలనాథులు బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు కారణం నితీశ్‌కు మాత్రమే మోడీని ఢీకొట్టే సత్తా ఉండడమే. రీసెంట్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం నితీశ్‌తో భేటీ అయ్యి బీజేపీ ముక్త్ భారత్‌ అంశంపై కీలక చర్చ నిర్వహించారు. నితీశ్‌ ఆలోచనలు సైతం బీజేపీకి వ్యతిరేకంగానే సాగుతున్నాయి. పైకి అంత ధాటిగా బీజేపీని విమర్శించకున్నా గురి చూసి కమలాన్ని కొట్టడమే నితీశ్ లక్ష్యం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈశాన్య రాష్ట్రాలను జేడీయూ ముక్త్‌గా మార్చడం నితీశ్‌కు ఊహించని షాకే. మొత్తంగా నితీశ్‌ బీజేపీకి బిహార్‌‌లో షాకిస్తే కమలనాథులు మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో దెబ్బకు దెబ్బా తీసినట్టు అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories