Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు

Devotees Throng Sabarimala Sree Dharma Sastha Temple Pathanamthitta For Darshan
x

Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు

Highlights

Sabarimala Temple: అయ్యప్ప స్వామి దర్శనానికి పొటెత్తుతున్న భక్తులు

Sabarimala Temple: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు గురువారం సాయంత్రం తెరిచారు.

ఇక రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా నిన్న తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో స్వామి దర్శనం కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. మరోవైపు రెండు నెలల పాటు సాగే స్వామి దర్శనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డైనమిక్‌ క్యూ కంట్రోల్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories