రూ.65,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ ఆప్ ప్రభుత్వం వీటిని కొనలేకపోవడం ఆశ్చర్యకరం : ఢిల్లీ బీజేపీ

రూ.65,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ ఆప్ ప్రభుత్వం వీటిని కొనలేకపోవడం ఆశ్చర్యకరం : ఢిల్లీ బీజేపీ
x
Gautam gambhir
Highlights

కరోనావైరస్‌తో పోరాడటానికి ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర నిధులను కోరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ బీజేపీ మండిపడింది.

కరోనావైరస్‌ తో పోరాడటానికి ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర నిధులను కోరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ బీజేపీ మండిపడింది.ఆదివారం ఆప్ ప్రభుత్వంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రూ .65,000 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినప్పటికీ వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇ) కొనలేకపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు.. 'కరోనావైరస్ కారణంగా ఐదు రోజుల సెషన్‌కు బదులుగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరీ.. రూ .65,000 కోట్ల బడ్జెట్‌ను ఢిల్లీ ప్రభుత్వం మార్చి 23 న ఆమోదించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీ ప్రభుత్వం 1-2 కోట్ల రూపాయల విలువైన పిపిఇ కిట్లను కొనుగోలు చేయలేకపోయింది. దీని వెనుక అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశం ఏమిటో' అని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం కరోనా వైరస్ విపత్తుపై మాట్లాడారు.. ఈ సంసదర్బంగా తమ ప్రభుత్వం.. కేంద్రం నుంచి పిపిఇ కిట్లు కోరిందని, అయితే ఇంతవరకూ రాలేదని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపి గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ సమస్యపై మొసలి కన్నీరు కారుస్తుందని.. పిపిఇ కిట్లు, మాస్కులు కొనడానికి ఢిల్లీ ప్రభుత్వానికి రూ .50 లక్షలు విరాళంగా ఇవ్వడానికి తాను ముందుకొచ్చానని, అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారాయన. ఇదే క్రమంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసారమయ్యే టీవీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన కోట్లను పిపిఇ కిట్లలో ఉపయోగించినట్లయితే ప్రజలు ప్రయోజనం పొందేవారు అని గంభీర్ అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories