ఢిల్లీలో దట్టంగా అలముకున్న పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు.. రైళ్లు

Delhi: పలు విమానాలు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

Jyothi
Updated on: 21 Jan 2024 12:01 PM IST
Dense fog in Delhi
X

ఢిల్లీలో దట్టంగా అలముకున్న పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు.. రైళ్లు 

Delhi: దట్టమైన పొగమంచు, చలిగాలులతో ఉత్తరాది రాష్ర్టాల ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించాలని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన చలిగాలులు, పొగమంచు తాకిడి ఢిల్లీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ర్టాలకు విస్తరిస్తుందని పేర్కొన్నది. శనివారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. వెలుతురు సరిగా లేక పలు రాష్ర్టాల్లో రోడ్డు, రైలు రవాణా స్తంభించిపోయింది.

Jyothi

Jyothi

Next Story