ఢిల్లీ అల్లర్లు.. సంచలన ఆరోపణలు చేసిన సోనియాగాంధీ !

Arun Chilukuri
Published on: 26 Feb 2020 2:21 PM IST
ఢిల్లీ అల్లర్లు.. సంచలన ఆరోపణలు చేసిన సోనియాగాంధీ !
X
ఢిల్లీ అల్లర్లు.. సంచలన ఆరోపణలు చేసిన సోనియాగాంధీ !

ఢిల్లీ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర దాగుందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని విమర్శించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని ధ్వజమెత్తారు. 20 మంది మృతిచెందడం బాధాకరం అన్న సోనియా బాద్యత తీసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అల్లర్లు జరుగుతుంటే కేజ్రీవాల్, అమిత్ షా ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తగినంత భద్రతను మొహరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలపై సీఎం కేజ్రీవాల్ దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సాయం చేయాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story