ఢిల్లీలో డాక్టర్ల ఆందోళన.. వైద్య సేవలు నిలిచిపోతాయా?

ఢిల్లీలో డాక్టర్ల ఆందోళన.. వైద్య సేవలు నిలిచిపోతాయా?
NEET-PG Counselling: నీట్ - పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు.
NEET-PG Counselling: నీట్ - పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ర్యాలీగా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్నవారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఆసుపత్రిలోని అన్ని ప్రధాన గేట్లను మూసేశారు. దీంతో లోపలే పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగుతున్నాయి.
చివరి ప్రయత్నంగా ఈ నిరసన తెలుపుతున్నామని కానీ, ప్రభుత్వం వినడం లేదని రెసిడెంట్ వైద్యులు అంటున్నారు. మరోవైపు స్థానిక ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సైతం రేపు ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన బాట పట్టడంతో ఆస్పత్రులలో పెషేంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జౌట్ షేషెంట్ విభాగంలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రులకు వచ్చిన పెషేంట్లు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని పలు పెద్ద పెద్ద ఆస్పత్రులలో ఇదే పరిస్థితి నెలకొంది.
ఎప్పుడో జరగాల్సిన నీట్ పరీక్ష కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించారు. ఫలితాలు కూడా విడదలయ్యాయి. అయితే EWS కోటాకు సంబంధించిన వివాదం కొనసాగతున్న నేపథ్యంలో కౌన్సిలింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. నీట్ పీజీ కౌన్సిలింగ్ వాయిదా పడటంతో దేశంలోని పలుచోట్ల రెసిడెంట్ డాక్టర్లు నిరసన బాటపడుతున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT