రెచ్చిపోయిన పోకిరీలు.. పోలీసుస్టేషన్‌లోకి చొరబడి మరీ కానిస్టేబుల్‌పై దాడి..

Delhi Policeman: ఢిల్లీలో పోకిరీలు రెచ్చిపోయారు. సాక్షాత్తూ పోలీస్‌స్టేషన్‌లోనే హెడ్‌కానిస్టేబుల్‌ను చితకబాదారు.

Arun Chilukuri
Updated on: 6 Aug 2022 6:45 PM IST
Delhi Policeman Was Beaten by a Crowd Inside Police Station
X

రెచ్చిపోయిన పోకిరీలు.. పోలీసుస్టేషన్‌లోకి చొరబడి మరీ కానిస్టేబుల్‌పై దాడి..

Delhi Policeman: ఢిల్లీలో పోకిరీలు రెచ్చిపోయారు. సాక్షాత్తూ పోలీస్‌స్టేషన్‌లోనే హెడ్‌కానిస్టేబుల్‌ను చితకబాదారు. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌లో ఉన్న పోలీస్‌స్టేషన్లోకి దాదాపు 12 మందితో కూడిన పోకిరీల గుంపు వెళ్లింది. పీఎస్‌ లోపలికి వెళ్లడమే ఆలస్యం కుర్చీలో కూర్చున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను పోకిరీల గుంపు చుట్టుముట్టి ఆయన్ని చితకబాదారు. సాక్షాత్తూ పీఎస్‌లోనే జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హెడ్ కానిస్టేబుల్‌ను పోకిరీల గుంపు చితబాతుండగా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పక్కనే పోలీసులున్నా వారు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. అయితే హెడ్‌కానిస్టేబుల్‌ను పోకిరీలు కొడుతున్న దృశ్యాలను తోటి కానిస్టేబుల్ తమ సెల్‌ఫోన్లో రికార్డు చేయడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పక్క పక్కనే ఉంటున్న రెండువర్గాలు ఘర్షణకు దిగాయని వారు పీఎస్‌కు వచ్చిన సందర్భంగా బాధిత హెడ్‌కానిస్టేబుల్ ఓ వర్గానికి అనుకూలంగా మాట్లాడడంతో మరో వర్గానికి చెందిన వ్యక్తులు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు సమాచారాం. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. వారికి కఠిన శిక్షలు పడేటట్లు చేస్తామన్నారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story