Arvind Kejriwal: ఢిల్లీ సీఎం నివాసానికి క్రైం బ్రాంచ్‌.. స్వయంగా కేజ్రీవాల్‌కు నోటీసులు ఇస్తామన్న పోలీసులు

Arvind Kejriwal: స్వయంగా కేజ్రీవాల్‌కు నోటీసులు ఇస్తామన్న పోలీసులు

Shekhar G
Published on: 3 Feb 2024 12:11 PM IST
Delhi Police Team At CM Arvind Kejriwals Residence Again To Serve Notice
X

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం నివాసానికి క్రైం బ్రాంచ్‌.. స్వయంగా కేజ్రీవాల్‌కు నోటీసులు ఇస్తామన్న పోలీసులు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసం దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. కేజ్రీవాల్‌ నివాసానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఇటీవల సీఎం కేజ్రీవాల్‌, మంత్రి అతిషీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్, మంత్రి అతిషిలకు నోటీసులు ఇచ్చేందుకు సీఎం నివాసానికి వెళ్లారు క్రైం బ్రాంచ్ పోలీసులు. తమకు నోటీసులు ఇచ్చి వెళ్లాలని సీఎం కార్యాలయ సిబ్బంది తెలపగా.. స్వయంగా కేజ్రీవాల్‌కే నోటీసులు ఇస్తామన్నారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story