Rahul Gandhi: రాహుల్‌గాంధీ నివాసానికి పోలీసు ఉన్నతాధికారులు

Rahul Gandhi: రాహుల్‌ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసుల నోటీసులు..

Jyothi
Updated on: 19 March 2023 1:30 PM IST
Delhi Police at Rahul Gandhi Residence
X

Rahul Gandhi: రాహుల్‌గాంధీ నివాసానికి పోలీసు ఉన్నతాధికారులు

Rahul Gandhi: ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. భారత్ జోడో యాత్రలో రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసుల నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు రాహుల్ గాంధీ స్పందించలేదని ఆయన నివాసానికి వెళ్లారు ఉన్నతాధికారులు. లైంగిక వేధింపులకు సంబంధించి రాహుల్‌ను సంప్రదించిన.. మహిళల వివరాలను కోరుతూ మార్చి 16న రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్ట్‌లను పరిగణలోకి తీసుకొని రాహుల్ గాంధీకి నోటీసులు అందించారు. రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు ప్రత్యేక పోలీసు కమిషనర్ స్థాయి అధికారి ప్రయత్నిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story