Congress: కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీ పీసీసీ చీఫ్ అరవిందర్‌ సింగ్‌ లవ్లీ రాజీనామా

Congress: మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపిన అరవిందర్

Shashank Gullapelli
Published on: 28 April 2024 4:34 PM IST
Delhi PCC Chief Arvinder Singh Lovely Resigns For His Post
X

Congress: కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీ పీసీసీ చీఫ్ అరవిందర్‌ సింగ్‌ లవ్లీ రాజీనామా 

Congress: పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీ పీసీసీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై అరవిందర్ సింగ్ వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖహర్గేకు పంపారు. కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా అధిష్టానం ఆప్ తొ పొత్తు పెట్టుకుందని అన్నారు. తన అభిప్రాయాలకు అధిష్టానం గౌరవం ఇవ్వడం లేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అరవిందర్ సింగ్ ఢిల్లీలో కీలక నాయకుడిగా వెలుగొందుతున్నారు. షీలా దీక్షిత్ మంత్రివర్గంలో కీలక సభ్యుడిగా కొనసాగారు. పలు మార్లు మంత్రిగా పని చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story