నేడు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు

Delhi Ordinance Discussion in Parliament Today
x

నేడు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు

Highlights

Parliament: బిల్లును అమిత్‌షా ప్రవేశపెట్టే అవకాశం

Parliament: ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల బదిలీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తోంది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు అటు విపక్షాలు కూడా సిద్దమైయ్యాయి. దీంతో ఇవాళ లోక్‌సభలో రగడ జరిగే అవకాశం ఉంది

ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి కొద్ది రోజుల ముందు, ఢిల్లీలో బదిలీలు, నియామకాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు అప్పగించింది. ఈ బిల్లును వ్యతిరేకించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష నేతల నుంచి మద్దతు కోరారు. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఇప్పటికే ఆప్‌కు మద్దతు తెలిపాయి. పార్టీ దీనికి ఇప్పటికే మద్దతు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories