Delhi Lockdown: ఢిల్లీలో మరోవారం లాక్‌డౌన్

Samba Siva Rao
Published on: 24 April 2021 8:52 PM IST
delhi Lock down
X
ఢిల్లీ లాక్ డౌన్ ఫైల్ ఫోటో 

Delhi Lockdown: ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో మరో వారమైనా లాక్‌డౌన్ పొడిగించాలని మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఉంది. లోకల్ సర్కిల్స్‌ అనే కమ్యూనిటీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించాలని కేజ్రీవాల్‌ను కోరారు. 68 శాతం మంది కనీసం మరో వారం రోజులైనా లాక్‌డౌన్ పొడిగించాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో 8,000 మంది అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. ఢిల్లీ వ్యాపారులకు చెందిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సైతం కరోనా అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాలని కోరింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story