Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ముగిసిన గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ
Delhi Liquor Scam: బుచ్చిబాబు కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ రిమాండ్‌కు..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసు విచారణ.. ముగిసిన గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీ నేటితో ముగిసింది. బుచ్చిబాబును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేయగా మూడ్రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది కోర్టు. ఇప్పుడు కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చేరుకున్నారు. ఈరోజు ఉదయం మాగుంట కుమారుడిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో మాగుంట రాఘవరెడ్డిని కాసేపట్లో స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
Next Story




