ఢిల్లీలో కరోనా కేసులు పెరగడానికి కారణలు ఇవే!

ఢిల్లీలో కరోనా కేసులు పెరగడానికి కారణలు ఇవే!
x
Highlights

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న శుక్రవారం ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అక్కడ శుక్రవారం కొత్తగా 5,891 కేసులు.. 47 మరణాలు చోటుచేసుకున్నాయి..

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న శుక్రవారం ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అక్కడ శుక్రవారం కొత్తగా 5,891 కేసులు.. 47 మరణాలు చోటుచేసుకున్నాయి.. అయితే అక్కడ ఇన్ని కేసులు నమోదు కావడానికి కారణం గురించి అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ మీడియాకి వెల్లడించారు.

మానవ తప్పిదాల వల్లే ఇలా జరుగుతుందని అయన అన్నారు. ప్రస్తుతం పండగ సీజన్ కావడం, ఢిల్లీలో వాయుకాలుష్య పెరుగుదల ఉండడం వలన కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతునప్పటికి ప్రజలు నిర్లక్ష్యం వహించారని అన్నారు. కనీసం మాస్క్ ను కూడా ధరించడం లేదని అయన అన్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనాకి టీకా వచ్చేవరకు మాస్క్ తప్పనిసరి అని అయన పేర్కొన్నారు. లాక్ డౌన్ విధించడం కన్నా మాస్క్ ధరించడమే కరోనా కట్టడికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని అయన అభిప్రాయపడ్డారు. అటు ఢిల్లీలో కరోనా కేసులు పెరగడం పట్ల సోమవారం కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ భల్లా ఢిల్లీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి ఈరోజు ( శనివారం ) నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 48,268 కేసులు నమోదు కాగా, 551 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 59,454 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. . ఇక దేశంలో యాక్టివ్ కేసులు 5,82,649 ఉండగా, 74,32,829 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,21,641 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 91.34 శాతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories