Delhi Govt cancels all state University Exams: జరిగే పరీక్షలన్నీ రద్దు: ఉప ముఖ్యమంత్రి

Delhi Govt cancels all state University Exams: జరిగే పరీక్షలన్నీ రద్దు: ఉప ముఖ్యమంత్రి
x
Delhi govt cancels all state university exams amid corona virus crisis
Highlights

Delhi Govt cancels all state University Exams: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Delhi Govt cancels all state University Exams: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్టేట్ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న వివిధ కోర్సులలో తుది పరీక్షలతో సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ప్రకటించారు. విశ్వవిద్యాలయాలు నిర్ణయించిన మూల్యాంకన పరిమితుల ఆధారంగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తామని మంత్రి తెలిపారు. దీనిపై ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరీక్షలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేజ్రివాల్‌ లేఖ రాశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.

అందులో ఇలా పేర్కొన్నారు. "మా యువత కొరకు, డియు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల చివరి సంవత్సరం పరీక్షలను వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని రద్దు చేసి వారి భవిష్యత్తును కాపాడాలని నేను గౌరవ ప్రధానిని కోరుతున్నాను" అని సిఎం కేజ్రీవాల్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలల పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసిన కరోనావైరస్ వ్యాధి వ్యాప్తి కారణంగా చివరి సంవత్సరం పరీక్షతో సహా అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించిన కొద్ది గంటల తర్వాత కేజ్రీవాల్ ఈ విషయంపై ప్రధానికి విజ్ఞప్తి చెయ్యడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories