Arvind Kejriwal Meet Dr. Aseem Gupta Family: కరోనాతో చనిపోయిన వైద్యుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేసిన కేజ్రీవాల్!

Arvind Kejriwal Meet Dr. Aseem Gupta Family: కరోనాతో చనిపోయిన వైద్యుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేసిన కేజ్రీవాల్!
x
Arvind Kejriwal (File Photo)
Highlights

Arvind Kejriwal Meet Dr. Aseem Gupta Family: కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో వైద్యులు , పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల పోరాటం వెలకట్టలేనిది.

Arvind Kejriwal Meet Dr. Aseem Gupta Family: కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో వైద్యులు, పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల పోరాటం వెలకట్టలేనిది..తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ఈ క్రమంలో పలువురు వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ దవాఖానకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ అసీం గుప్తాకు కరోనా సోకడంతో ఆయన జూన్ 28న చనిపోయారు. ఆయన మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. అంతేకాకుండా ఆయన కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని జూన్ 29న ప్రకటించారు. శుక్రవారం బాధిత వైద్యుడి కుటుంబాన్ని కేజ్రీవాల్ సందర్శించి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కును అందజేశారు..

ఇక కరోనా వైరస్ ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలలో ఢిల్లీ కూడా ఒకటి.. అక్కడ గురువారం ఒక్క‌రోజే క‌రోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్త‌గా 2373 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక క‌రోనా నుంచి కోలుకున్న 3015 మంది గురువారం డిశ్చార్జి అయ్యారు. దేశ రాజ‌ధానిలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,175కు చేరింది. మ‌ర‌ణాల సంఖ్య 2,864. ఇక గురువారం రోజు 20,822 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గడిచిన 24 గంటల్లో భారత్‌లో 20,903 కేసులు నమోదు కాగా, 379 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 6,25,544 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,27,439 ఉండగా, 3,79,891 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 18,213 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,576 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 92,97,749 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories