Delhi Lockdown: లాక్​ డౌన్​ మరో వారం పొడిగింపు

Delhi Lockdown: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టింది.

Samba Siva Rao
Updated on: 16 May 2021 4:18 PM IST
Delhi Lockdown: Delhi Government Extends Lockdown for One Week | Arvind Kejriwal
X

Arvind Kejriwal

Delhi Lockdown: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టింది. అయిన‌ప్ప‌టికీ ఢిల్లీలో లాక్ డౌన్ మరో వారం రోజులు పొడిగిస్తూ ఆప్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. లాక్ డౌన్ తో ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయప‌డ్డారు. మహమ్మారి తీవ్రతను మరింతగా తగ్గించేందుకు మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని ఆయ‌న తెలిపారు.

ఇప్పటిదాకా కరోనా కట్టడిలో చాలా వరకు విజయం సాధించామని, లాక్ డౌన్ తీసిస్తే క‌రోనా తీవ్ర‌త పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. వచ్చే సోమవారం వరకు (24వ తేదీ) ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు. కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కన్నా దిగువకు తీసుకురావడమే లక్ష్యమన్నారు అరవింద్ కేజ్రీవాల్ .

Samba Siva Rao

Samba Siva Rao

Next Story