Delhi Floods: వరద ముంపులోనే ఢిల్లీలోని పలు ప్రాంతాలు

Delhi Floods Yamuna water Level Starts receding
x

Delhi Floods: వరద ముంపులోనే ఢిల్లీలోని పలు ప్రాంతాలు

Highlights

Delhi Floods: క్రమంగా తగ్గుముఖం పడుతున్న వరద ప్రవాహం

Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాలు ఇంకా వరద ముట్టడిలోనే ఉన్నాయి. నది నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్‌ దాకా వరద నీరు చేరింది. యమునా నదిలో నీటిమట్టం గురువారం 208.66 మీటర్లకు చేరుకోగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా 208.17 మీటర్లకు తగ్గిపోయింది. వరద ప్రవాహం ధాటికి దెబ్బతిన్న ఇంద్రప్రస్థ వాటర్‌ రెగ్యులేటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా, CM అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిశీలించారు.

ఇసుక బస్తాలు, కంకరతో వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, సైనిక జవాన్లు, ఢిల్లీ అధికారులు శ్రమిస్తున్నారు. నగరంలోని రోడ్లపై వరద నీరు ఇంకా తగ్గలేదు. రహదారులు చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లను ట్రాఫిక్‌ పోలీసులు మూసివేశారు. వాహనాలను అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories