ఢిల్లీలో 27వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు

ఢిల్లీలో 27వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
x
Highlights

అసలే ఢిల్లీ.. ఆ పై ఎముకలు కొరికే చలి.. ఆ చలిలో రైతులు పోరాటం చేస్తూ ఢిల్లీ పెద్దలకు వేడి పుట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా అన్నదతలు...

అసలే ఢిల్లీ.. ఆ పై ఎముకలు కొరికే చలి.. ఆ చలిలో రైతులు పోరాటం చేస్తూ ఢిల్లీ పెద్దలకు వేడి పుట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా అన్నదతలు నిరసనలు చేస్తున్నారు. వారి ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. అందుకోసం నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలకు రైతులు దిగారు. ఎముకలు కొరికే చలిలో అన్నదతలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా మహారాష్ట్ర నుంచి రైతులు ఢిల్లీకి బయలు దేరారు అంతేకాదు రైతుల నిరసనలతో సింఘు, టిక్రి, ఘాజిపూర్, చిల్లా సరిహద్దులు మూతపడ్డాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీ, యూపీ ఘాజీపూర్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

అంతేకాదు చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనంటూ రైతు సంఘాల నేతలు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే అందులోనూ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరనున్నారు. ఈ నెల 25న రైతులతో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఆదివారం ప్రధాని నిర్వహించే మన్‌కి బాత్‌ను దేశ ప్రజలు వినకుండా చేసేందుకు రైతు సంఘాల నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. ఆ రోజు తినే ప్లేట్లతో సౌండ్ చేయాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories