ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. సిసోడియాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్..

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన ఉద్రిక్తతంగా మారింది.

Arun Chilukuri
Updated on: 20 Aug 2022 8:30 PM IST
Delhi Congress Holds protest, Demands Manish Sisodias Resignation
X

ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. సిసోడియాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్..

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన ఉద్రిక్తతంగా మారింది. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నూతన మద్యం పాలసీలో అవినీతికి పాల్పడిన మంత్రి సిసోడియా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా మనీశ్ సిసోడియాను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిసోడియా దిష్టిబొమ్మను కర్రలతో కొట్టడమే కాకుండా రోడ్డు మధ్యలో దహనం చేశారు. యువత భవిష్యత్‌ను కేజ్రీవాల్ సర్కార్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story