Arvind Kejriwal: ఇవాళ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌ హాజరుపై నెలకొన్న ఉత్కంఠ

Jyothi
Published on: 26 Feb 2024 7:32 AM IST
Delhi CM Kejriwal for ED investigation today
X

Arvind Kejriwal: ఇవాళ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం కేజ్రీవవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ను ఈడీ కోరింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఇప్పటికే ఆరుసార్లు సమన్లు పంపింది. దీంతో ఈరోజు ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున సమన్లు చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. కోర్టు విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది.

Jyothi

Jyothi

Next Story