Breaking News: వారం రోజులపాటు విద్యాసంస్థలు బంద్.. లాక్‌డౌన్‌పై ఆలోచిస్తున్నామన్న..

Breaking News: ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది.

Arun Chilukuri
Published on: 13 Nov 2021 6:31 PM IST
Delhi CM Kejriwal Announces Closing of Schools from Monday
X

Breaking News: వారం రోజులపాటు విద్యాసంస్థలు బంద్.. లాక్‌డౌన్‌పై ఆలోచిస్తున్నామన్న..

Breaking News: ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. ఢిల్లీలో వారం రోజుల పాటు విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి 17వరకూ భవన నిర్మాణాలు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లాక్‌డౌన్‌పై ఆలోచిస్తున్నామన్న కేజ్రీవాల్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీపావళి తర్వాత పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లలో ఉన్నా సరే మాస్క్ పెట్టుకోవాల్సి వస్తోంది. వింటర్ సీజన్‌లో మంచుతో పాటు కాలుష్యం తోడవ్వడంతో ప్రపంచంలోనే పది ఓవర్ పొల్యూటెడ్ నగరాల్లో మొదటి స్థానంలో నిలిచి ఢిల్లీ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇదే జాబితాలో ముంబై, కోల్‌కతా కూడా చేరిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story