రైతులకు మద్దతుగా రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఉపవాస దీక్ష!

రైతులకు మద్ధతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు

admin
Updated on: 13 Dec 2020 6:15 PM IST
రైతులకు మద్దతుగా  రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఉపవాస దీక్ష!
X

రైతులకు మద్ధతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. రైతులకు మద్ధతుగా ఒక రోజు ఉపవాసం చేపట్టాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం రైతులకు అండగా నిలవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు రైతులు దేశ వ్యతిరేకులు అంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు.

మరోవైపు రైతుల ఆందోళనను తీవ్రం చేశారు. రేపటి నుంచి మరింత ఉద్రితం చేసే ఆలోచనలో రైతులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19 వరకు వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. రేపటి నుంచి నిరాహార దీక్ష చేయనున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రైతులకు మద్ధతుగా దేశంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలలో ధర్నాలు చేయనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి..

admin

admin

Next Story