Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ

Arvind Kejriwal: ట్రయల్ కోర్టులో కేజ్రీని ప్రవేశపెట్టిన అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Jun 2024 8:50 PM IST
Delhi CM Arvind Kejriwal arrested by CBI
X

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ

Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్‌ను ప్రవేశ పెట్టారు. కోర్టులో విచారించిన తర్వాత ఆయనను అరెస్టు చేసేందుకు తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతించింది. దీంతో కేజ్రీవాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్‌తో తన బెయిల్‌పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్‌ ఉపసంహరించుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story