Delhi BRS Office: ప్రారంభానికి సిద్ధమైన ఢిల్లీ బీఆర్‌ఎస్‌ కార్యాలయం

Delhi BRS Office: వసంతవిహార్ లో అత్యాధునిక హంగులతో ఐదు అంతస్థుల్లో నిర్మాణమైన భవనం

Dhatripriya
Published on: 3 May 2023 4:03 PM IST
Delhi BRS Office Ready For Opening
X

Delhi BRS Office: ప్రారంభానికి సిద్ధమైన ఢిల్లీ బీఆర్‌ఎస్‌ కార్యాలయం

Delhi BRS Office: హస్తినలో బిఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ ప్రారంభానికి సిద్దమైంది. వసంతవిహార్ ప్రాంతంలో అత్యాధునిక హంగులతో ఐదు అంతస్థుల్లో నిర్మాణమైన ఈ భవనాన్ని రేపు మధ్యాహ్నం 1.05 కు బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నా్రు. గురువారం ఉదయం వాస్తు పూజతో పాటు పండితులు ప్రత్యేకంగా సుదర్శన హోమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటుగా ఢిల్లీ చేరుకున్న పలువురు మంత్రులు పార్టీ ఆఫీస్ ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 2021 సెప్టెంబర్‌ 2వ తేదీన వసంత్‌ విహార్‌లో సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఏడాదిలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నారు. మొత్తం 1300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవన నిర్మాణం జరిగింది.

అందులో లోయర్‌ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, మూడవ అంతస్థులతో కలిపి మొత్తం 5 అంతస్థుల్లో భవనాన్ని నిర్మాణనాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. లోయర్‌ గ్రౌండ్‌లో మీడియా సమావేశాలను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్‌తో పాటు రెండు ఇతర గదులను నిర్మాణం చేశారు. లోయర్‌ గ్రౌండ్‌లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్‌ను ఏర్పాటు చేశారు .గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్‌ను సిద్ధం చేశారు.

మొదటి అంతస్థులో పార్టీ అధ్యక్షుడి ఛాంబర్‌, పేషీలతో పాటు ఒక కాన్ఫరెన్స్‌ హాలును ఏర్పాటు చేశారు. రెండవ, మూడవ అంతస్థుల్లో దేశ రాజధానిలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు.. మరో రెండు ప్రత్యేక సూట్‌ రూంలను సిద్ధం చేశారు. ఒకటి పార్టీ అధ్యక్షుడు బస చేసేందుకు ప్రెసిడెంట్‌ సూట్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేసేందుకు మరొక సూట్‌ ప్రత్యేకంగా రెడీగా ఉంచారు.

Dhatripriya

Dhatripriya

Next Story