Delhi Acid Attack: ఢిల్లీలో యువతిపై యాసిడ్ దాడి

Delhi Acid Attack: ఢిల్లీలో యువతిపై యాసిడ్ దాడి
x

Delhi Acid Attack: ఢిల్లీలో యువతిపై యాసిడ్ దాడి

Highlights

Delhi Acid Attack: ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ప్రాంతంలో ఓ మహిళపై యాసిడ్‌ దాడి జరిగింది.

Delhi Acid Attack: ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ప్రాంతంలో ఓ మహిళపై యాసిడ్‌ దాడి జరిగింది. ముకుంద్‌పూర్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ సెకండియర్‌ చదువుకుంటోంది. అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్‌ బైక్‌పై ఇషాన్, అర్మాన్‌ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్‌ ఇచ్చిన బాటిల్‌ను ఓపెన్‌ చేసిన అర్మాన్‌ అందులోని యాసిడ్‌ను యువతి ముఖంపై చల్లాడు. రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్‌ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు.

అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితేందర్‌ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతరమయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్‌ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories