బిపిన్‌ రావత్ ఇంటికి చేరుకున్న రాజ్‌నాథ్.. అందరిలోనూ ఉత్కంఠ

Bipin Rawat Chopper Crash: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ దిల్లీలోని సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ నివాసానికి వెళ్లారు.

Arun Chilukuri
Published on: 8 Dec 2021 4:22 PM IST
Defence Minister Rajnath Singh Visits Gen Rawats Residence in New Delhi
X

బిపిన్‌ రావత్ ఇంటికి చేరుకున్న రాజ్‌నాథ్.. అందరిలోనూ ఉత్కంఠ

Bipin Rawat Chopper Crash: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ దిల్లీలోని సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ నివాసానికి వెళ్లారు. ఆయన వెంట పలువురు రక్షణశాఖ, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదం గురించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. రావత్, ఆయన భార్య సహా 12 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయినట్టు సమాచారం. అయితే సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక పరిస్థితి ఏంటనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే రక్షణ మంత్రి బిపిన్ రావత్ నివాసానికి చేరుకోవడంతో అసలేం జరుగుతోందనే అంశంపై ఉత్కంఠ మరింతగా పెరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story