భారత్‌పై మళ్లీ దావూద్ ఇబ్రహీం గురి..!

Dawood Ibrahim: గ్యాంగ్​స్టర్​, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్​ ఇబ్రహీం భారత్​పై మళ్లీ గురిపెట్టాడు.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 6:53 PM IST
Dawood Ibrahim Forms Special Unit to Target India
X

భారత్‌పై మళ్లీ దావూద్ ఇబ్రహీం గురి..!

Dawood Ibrahim: గ్యాంగ్​స్టర్​, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్​ ఇబ్రహీం భారత్​పై మళ్లీ గురిపెట్టాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు ఎన్‌ఐఏ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దావుద్ హిట్ లిస్ట్‌లో రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అంతేకాదు దావూద్ ఇబ్రహీం తన ప్రత్యేక విభాగంతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను ప్రేరేపించే లక్ష్యంతో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో దేశంపై దాడికి ప్లాన్ చేస్తున్నాడని ఎన్‌ఐఏ తెలిపింది.

ఢిల్లీ, ముంబైలపై దావూద్ ఫోకస్ పెట్టినట్లు దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో దావూద్, అతని అనుచరులపై ఈడీ ఇటీవలే మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దావుద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని సహాయకులు, ముఠా సభ్యులను ఈడీ ప్రశ్నించనుంది. మనీలాండరింగ్ కేసులో ఇక్బాల్ కస్కర్‌కు ఫిబ్రవరి 24 వరకు ED కస్టడీ విధించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story