దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్ వార్తలపై సోదరుడు స్పందన..

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు కరోనా సోకిందనే వార్తలను అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం కొట్టిపారేశారు.

Raj
By Raj
Published on: 5 Jun 2020 9:45 PM IST
దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్ వార్తలపై సోదరుడు స్పందన..
X

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు కరోనా సోకిందనే వార్తలను అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం కొట్టిపారేశారు. కరోనా మహమ్మారి ఒక భయంకరమైన అంటువ్యాధి అని చెబుతూ.. అయితే తన సోదరుడు దావూద్ మరియు అతని భార్య లేదా కుటుంబంలో మరెవ్వరూ కరోనా బారిన పడలేదని అనీస్ చెప్పారు. దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్ , యుఎఇలలో తన వ్యాపారాన్ని నడుపుతున్నాడని చెప్పారు.

అయితే అనీస్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడన్నది తెలియలేదు. కాగా దావూద్ ,అతని భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. వీరిద్దరినీ కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించినట్లు.. అలాగే దావూద్ తోపాటు అతని సిబ్బంది , గార్డ్లను నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి.

Raj

Raj

Next Story