కరోనా టీకాలు తీసుకున్న వందలాది మంది నక్సల్స్

ఏపీ తెలంగాణ నుంచి మావోలకు చేరిన టీకాలు అనారోగ్యం బారిన మావోయిస్ట్ అగ్రనేతలు ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ దంపతుల వెల్లడి

Sandeep Reddy
Updated on: 4 Dec 2021 10:15 AM IST
కరోనా టీకాలు తీసుకున్న వందలాది  మంది నక్సల్స్
X

Corona Vaccination: దంతెవాడ పోలీసుల ఎదుట మొన్న లొంగిపోయిన మావోయిస్టు దంపతులు సంచలన విషయాలు వెల్లడించారు. మావోయిస్టు అగ్రనేతలు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. అలాగే, దాదాపు 700 మంది మావోయిస్టులు కరోనా టీకాలు వేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. చత్తీస్‌గఢ్‌లో టీకాలపై అనుమానంతో ఏపీ, తెలంగాణ నుంచి టీకాలను తెప్పించుకున్నట్టు వివరించారు. టీకాలతోపాటు చికిత్సకు అవసరమైన ఔషధాలు కూడా మావోయిస్టులకు చేరాయన్నారు.

మావోయిస్టు దక్షిణ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నారని పలువురు మావోయిస్టు అగ్రనేతలు కొవిడ్ టీకాలు తీసుకున్నట్టు తెలిపారు. దక్షిణ బస్తర్ విభాగం అగ్రనేతలు అనారోగ్యతో బాధపడుతున్నారని, బహుశా వారికి కరోనా సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారు కర్రల సాయంతో నడుస్తున్నారని, ఆరోగ్యం కొంత విషమంగానే ఉందని తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story