Cyclone Yaas: ఇవాళ బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన

Cyclone Yaas: PM Modi to Conduct Aerial Survey
x

Cyclone Yaas: ఇవాళ బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన

Highlights

Cyclone Yaas: యాస్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

Cyclone Yaas: యాస్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టం, చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకోనున్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయనున్నారు. వీలయినంత తొందరగా సాధారణ పరిస్థితులు నెలకొనేటట్టు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. బాలాసోర్, భద్రక్, పూర్వ మిడ్నాపూర్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు పశ్చిమబెంగాల్‌లోని చాలా ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిసింది. దాంతో జనం ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయ బృందాలు వెళ్లడానికి కూడా వీలు లేకపోవడంతో కొన్ని చోట్ల ఆహారం అందని పరిస్థితి ఎదురైంది. తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో 15వేల కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. వర్షాలు తగ్గిన తరువాత నష్టాలను పూర్తిగా అంచనా వేస్తామని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు జూన్‌ మూడో తేదీ నుంచి దువారే త్రాణ్ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి జూన్‌ 18 వరకు అధికారులు బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, 18 నుంచి 30 వరకు వాటిని తనిఖీ చేస్తారని తెలిపారు. జులై ఒకటి నుంచి 8వ తేదీలోగా అందరికీ పరిహారం అందిస్తామని చెప్పారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తామని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories