తమిళనాడు, పుదుచ్చేరి వైపు దూసుకొస్తున్న నివర్‌ తుపాను

తమిళనాడు, పుదుచ్చేరి వైపు దూసుకొస్తున్న నివర్‌ తుపాను
x
Highlights

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. చెన్నైకి 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమైన నివర్‌...

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. చెన్నైకి 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమైన నివర్‌ తుపాను తీరం వైపు వడివడిగా పయనిస్తోంది. రాబోయే 12 గంటల్లో పెను తుపానుగా మారి చెన్నై సమీపంలోని మహాబలిపురం- కారైక్కాల్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తమిళనాడులో తుపాన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఏడు జిల్లాల్లో హై అలెర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాన్‌ దృష్ట్యా సెలవు ప్రకటించామని, పరిస్థితిని బట్టి సెలవు పొడిగిస్తామని తమిళనాడు సర్కార్‌ చెబుతోంది. తుపాన్‌ సహాయ చర్యలపై ప్రధాని మోదీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories