దూసుకొస్తున్న నివర్ తుపాను.. ఏపీ, తమిళనాడుకు ఎఫెక్ట్

దూసుకొస్తున్న నివర్ తుపాను.. ఏపీ, తమిళనాడుకు ఎఫెక్ట్
x
Highlights

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుందని విశాఖ వాతావరణ...

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైంకల్‌..మామళ్ళపురం మధ్య ఈ నెల 25న తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది.

ఈ తుఫాన్‌కు నివర్‌ అని పేరు పెట్టారు. ఇరాన్‌ దేశం ఈ పేరును సూచించింది. ఇప్పటికే ఈ వాయిగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడు ఉత్తర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల సాధారణ వర్షాలు మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర‌్షాలు పడనున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. చేపల వేటకు వెళ్ళవద్దని ఆదివారం నుంచే మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories