CWC Meet: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా అసంతృప్తి

CWC Meet: బెంగాల్, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 11 May 2021 12:25 PM IST
CWC Meet: Sonia Gandhi Reviews on Five States Election Results
X

CWC Meet: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా అసంతృప్తి

CWC Meet: బెంగాల్, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తగిలిన ఎదురుదెబ్బలను సీరియస్‌గా పరిగణించాలని, సొంతింటిని చక్కదిద్దుకోవాల్సిన సమయమిదేనని సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం నిర్వహించారు.

కేరళ, అసోంలో అధికార పార్టీలపై కాంగ్రెస్ పైచేయి సాధించలేకపోవడాన్ని, బెంగాల్‌లో కనీసం ఖాతా కూడా తెరవలేక పోవడాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారామె. వాస్తవాలను గ్రహించలేకుంటే సరైన గుణపాఠాలను నేర్చుకోలేమని చెప్పారు. ఈ దిశగా తాను అందరి సూచనలు, సలహాలు కోరుతున్నట్లు తెలిపారు. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ కోసం అయ్యే వందల కోట్ల మొత్తాన్ని రాష్ట్రాలే భరించాలంటూ మోడీ సర్కార్ చెబుతుండటాన్ని ఆమె తప్పుపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story