CWC Meet: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా

CWC Meet: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 23న పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరగాల్సి ఉంది.

Arun Chilukuri
Published on: 11 May 2021 12:35 PM IST
CWC Meet: Congress President Election Delay Due To Coronavirus
X

CWC Meet: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా

CWC Meet: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 23న పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరగాల్సి ఉంది. దేశంలోని కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికను సోనియాగాంధీ ప్రస్తావించారు. ఇంతకు ముందు, సీడబ్ల్యూసీ సమావేశమైనప్పుడు జూన్ నెలాఖరు కల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్ని పూర్తి చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా వాయిదా వేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story