Kolhapur: రెండు వర్గాల మధ్య చిచ్చురేపిన వాట్సప్‌ స్టేటస్.. కర్ఫ్యూ విధించిన సర్కార్..!

Kolhapur: మహారాష్ట్ర కొల్హాపూర్‌లో అల్లర్లు చెలరేగాయి.

Arun Chilukuri
Published on: 7 Jun 2023 4:10 PM IST
Curfew in Kolhapur After WhatsApp Status on Aurangzeb Leads to Clashes
X

Kolhapur: రెండు వర్గాల మధ్య చిచ్చురేపిన వాట్సప్‌ స్టేటస్.. కర్ఫ్యూ విధించిన సర్కార్..!

Kolhapur: మహారాష్ట్ర కొల్హాపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. ఔరంగజేబుని పొగుడుతూ ఇద్దరు వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టడంతో వివాదం చెలరేగింది. స్టేటస్ వైరల్‌ కావడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు. దాంతో అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కొల్హాపూర్‌లో కర్ఫ్యూ విధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story